'జెంటిల్‌మన్' చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్..
- June 10, 2016
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'జెంటిల్‌మన్' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... 'మా చిత్రంలోని పాటలు, టీజర్, ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చాలా మంచి చిత్రాన్ని తీశారని అభినందించారు. సకుటుంబంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించాం. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'జెంటిల్‌మన్' అనే టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.ఇది ఒక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్' అని అన్నారు.'అష్టా చమ్మా' తరువాత దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. సురభి, నివేదా థామస్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, ఆనంద్, రోహిణి, రమాప్రభ, ప్రగతి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







