డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే.!

- June 01, 2024 , by Maagulf
డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే.!

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయ్. పెరిగిన ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు శరీరం సహకరించడం లేదు. దాంతో డీ హైడ్రేషన్లు.. గట్రా చాలా ఇబ్బంది పెడుతున్నాయ్.
అందుకే డీ హైడ్రేషన్ కాకుండా బయటి వేడిని తట్టుకుని శరీరం కూల్ అవ్వడానికి కొన్ని రకాలా ఆకు కూరలు బాగా ఉపయోగపడతాయ్. వాటిలో పుదీనాది మొదటి స్థానం.

ఈ హాట్ సమ్మర్‌‌లో డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే పుదీనాని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఉదయాన్నే పుదీనా జ్యూస్ తాగితే రోజంతా డీ హైడ్రేషన్ కాకుండా వుంటుంది.

అలాగే, పుదీనాని వంటల్లో కూడా విరివిగా వాడుకోవాలి. పలచని మజ్జిగ, రాగి జావ.. ఇలా జ్యూస్ ఏదైనా సరే, అందులో రెండు పుదీనా ఆకుల్ని వేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్‌లో వుంటాయ్.

పుదీనాలోని మింట్ సహజ సిద్ధమైన కూలెంట్‌గా పని చేస్తుంది. పుదీనాలోని మెంథాల్ అనే రసాయనం తొందరగా అలసటను దూరం చేస్తుంది. పుదీనాని జీలకర్ర, కాస్త నిమ్మరసంతో కలిపి జ్యూస్‌లా తీసుకుంటే, డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com