‘గం గం గణేశా’.! రష్మిక వచ్చినా వర్కవుట్ అవ్వలేదు.!
- June 01, 2024
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ముందు నుంచీ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రచార చిత్రాలు అన్నీ బాగున్నాయ్. అయితే, సినిమాలో అనుకున్న కథని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా థ్రిల్ ఫీలయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడినట్లు అభిప్రాయాలొచ్చాయ్. దాంతో, సినిమా అనుకున్న మేర ఆకట్టుకోలేకపోయింది.
ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ లుక్స్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, సినిమాలో కంటెంట్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. దాంతో, ఈ సినిమా బాక్సాఫీస్ పోరులో నిలబడడం కష్టమే అంటున్నారు.
ఇదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ నటించిన ‘భజే వాయువేగం’ సినిమాలు గట్టిగా పోటీ పడుతున్నాయ్.
సో, ఆ పోటీని తట్టుకుని వేసవి సెలవుల్ని ‘గం గం గణేశా’ క్యాష్ చేసుకుంటే ఆనంద్ దేవరకొండ లక్కు నక్క తోక తొక్కినట్లే చూడాలి మరి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!