క్రిష్ అభిమానులకు శుభవార్త!
- June 10, 2016
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అభిమానులకు ఇదో శుభవార్త! ఈ ఏడాదిలో దర్శకుడు పెళ్లికొడుకు కాబోతున్నాడట. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇంతకీ క్రిష్.. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోనున్నాడని ఇన్సైడ్ సమాచారం.క్రిష్ బ్రదర్ మ్యారేజ్ చేసుకుని యూఎస్‌లో సెటిలైపోయాడు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఫ్యామిలీ సభ్యుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో గతేడాది క్రిష్ మ్యారేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీలేదని ఆయన తోసిపుచ్చారు. జాతీయ అవార్డ్ తీసుకోవాలన్న ఆయన కోరిక నెరవేరడంతో మ్యారేజ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.'కంచె' మూవీకి ఆయన నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెల్సిందే! ఇంతకీ క్రిష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? హైదరాబాద్‌కు చెందిన రమ్య... వృత్తిరీత్యా ఆమె డాక్టర్. ఇదేమీ లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లేనని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలో క్రిష్ ఓ ఇంటివాడు కోబోతున్నాడన్న మాట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









