బెంగుళూరు పోలీసుల అదుపులో నటి హేమ..!
- June 03, 2024
బెంగుళూరు: బెంగుళూరులో గత నెల 20వ తేదీన జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్‌తో పాటు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు పాల్గొనడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ యాక్టర్ హేమపై బెంగుళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ నిర్థారణ పరీక్షల్లోనూ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినట్లు సమాచారం. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని హేమకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేయగా..
అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కావడం లేదని ఆమె పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హేమ డుమ్మా కొట్టడటంతో సీరియస్‌గా ఉన్న బెంగుళూరు సీసీబీ పోలీసులు ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నటి హేమను రేపు (మంగళవారం) పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







