ఏపీలో కౌంటింగ్‌కు భారీ భద్రత ఏర్పాట్లు
- June 03, 2024
ఏపీలో ఓట్ల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సుదీర్ఘ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు వెల్లడికానుంది. గెలిచేది ఎవరో? ఓడేది ఎవరో? తేలిపోనుంది. రేపు (జూన్ 4) ఉదయం 8గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి టేబుల్ వద్దకు ఒక ఏజెంట్ ను అనుమతించనున్నారు. అయితే ఏజెంట్ వద్ద పెన్ను, పేపర్ తప్ప ఎలాంటి వస్తువులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈవీఎంలను సీల్ చేసే విధానం, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సూచనలు చేశారు. ఇండెక్స్ కార్డ్, మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.
ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు.
రేపటి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని చోట్ల డ్రోన్లతో గస్తీ నిర్వహించారు. ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అలాంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరక్కుండా ఈసీతో పాటు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.
కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కేంద్ర, ఏపీఎస్పీ, సీఏపీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 144 సెక్షన్ తో ఆయా జిల్లాల ఎస్పీలు భద్రతను కట్టుదిట్టం చేశారు. మాచర్ల, తాడిపత్రి, పిఠాపురం, తిరుపతి వంటి ప్రాంతాలను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. కౌంటింగ్ రోజున అల్లర్లు, గొడవలకు పాల్పడితే జైలుకు పంపుతామని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







