కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్
- June 07, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ కావడంతో ఆయనను నియమానికి చంద్రబాబు మొగ్గుచూపారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. కొత్త చీఫ్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ తక్షణమే బాధ్యతలను స్వీకరించనున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన నియామకం వెంటనే జరిగింది. ఈ నెల 12వ తేదీన జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను కూడా ఆయన చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







