రష్యాలో వైద్య విద్యనభ్యసిస్తున్న నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి
- June 07, 2024
రష్యా: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని నదిలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మునిగిపోయారు.రష్యాలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. నలుగురు విద్యార్థులు - 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వెలికి నొవ్‌గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు. వోల్ఖోవ్ నదిలో మునిగిపోతున్న ఒక భారతీయ విద్యార్థిని రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నిస్తున్న క్రమంలో వారు కూడా మునిగి పోయారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.అయితే ఒక యువకుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. "మేము మృతదేహాలను వీలైనంత త్వరగా బంధువులకు పంపించడానికి కృషి చేస్తున్నాము. ప్రాణాలను రక్షించిన విద్యార్థికి కూడా సరైన చికిత్స అందించబడుతోంది" అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం X లో తెలిపింది. "ప్రాణాలు కోల్పోయిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" అని X లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!