పోలీసుల మరో యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

- June 07, 2024 , by Maagulf
పోలీసుల మరో యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు చెందిన మరో యాప్‌ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు టీఎస్సీఓపీ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు.

యాప్‌లను హ్యాక్ చేసి అందులోని డేటాను కేటుగాళ్లు ఆన్ అమ్ముతున్నారు కేటుగాళ్లు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా ఇస్తామంంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ రెండు యాప్ లలో దాదాపు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉన్నట్లు తెలుస్తోంది. వారి డేటానే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు సైబర్ కేటగాళ్లు.

కాగా, జనాలకు సత్వరమే సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాక్ ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని వేదికగా చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇందులో చాలా మంది పౌరుల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. హ్యాకర్లను గుర్తించేందుకు పోలీసుులు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com