మూడోసారి NDA ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్
- June 07, 2024
న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ నరేంద్ర మోడీ అయ్యారు. ఇటీవల గెలిచిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన మోడీ..
తనను లోక్ సభ పక్షనేతగా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోడీ రాష్ట్రపతిని కోరారు. ఎన్డీఏ మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అనంతరం.. మోడీని కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. దీంతో ఆదివారం మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 ప్లస్ సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







