రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
- June 09, 2024
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు.గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల 'జోహార్ రామోజీరావు' నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
అంత్యక్రియల్లో తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు.ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







