టెలిమార్కెటింగ్ నియమాలు ఉల్లంఘన.. Dh150,000 జరిమానా

- June 10, 2024 , by Maagulf
టెలిమార్కెటింగ్ నియమాలు ఉల్లంఘన.. Dh150,000 జరిమానా

యూఏఈ: ఫోన్ కాల్స్ ద్వారా టెలిమార్కెటింగ్, కొత్త నియంత్రణలు మరియు యంత్రాంగాలను అమలు చేయడంపై యూఏఈ నిబంధనలను కఠినతరం చేసింది. ఉల్లంఘించినవారికి హెచ్చరికలు జారీ చేసింది. Dh150,000 వరకు జరిమానాలతో సహా పరిపాలనాపరమైన జరిమానాలను విధిస్తామని పేర్కొంది. ఆగష్టు 2024 మధ్య నుండి ఉల్లంఘించిన వారిపై క్రమంగా అడ్మినిస్ట్రేటివ్ జరిమానాలు విధించబడతాయని తెలిపింది. హెచ్చరికలు మరియు జరిమానాల నుండి Dh150,000 వరకు విధిస్తామని పేర్కొంది. ఉల్లంఘించిన కంపెనీ కార్యకలాపాలను పాక్షికంగా లేదా పూర్తిగా నిలిపివేయడం, లైసెన్స్ రద్దు చేయడం, వాణిజ్య రిజిస్ట్రీ నుండి తీసివేయడం, టెలికమ్యూనికేషన్ సేవలను నిలిపివేయడం కూడా నిబంధనల్లో ఉన్నాయని వెల్లడించింది.  

కొత్త నిబంధనలు టెలిమార్కెటింగ్ కార్యకలాపాలలో పాల్గొనే ముందు మార్కెటింగ్ కంపెనీలు కాంపిటెన్షియల్ అథారిటీ నుండి ముందస్తు అనుమతిని పొందడం తప్పనిసరి.వ్యక్తులు తమ పేర్లతో రిజిస్టర్ చేయబడిన ఫోన్‌లను ఉపయోగించి మార్కెటింగ్ కాల్‌లు చేయడం నిషేధించారు. అన్ని మార్కెటింగ్ కాల్‌లు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన టెలిమార్కెటింగ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ చేయబడిన ఫోన్‌ల నుండి మాత్రమే కాల్స్ చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ కాల్‌లు ఉదయం 9 మరియు సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే అనుమతించబడతాయి. కాల్ చేయవద్దు రిజిస్ట్రీ (DNCR)లో నమోదు చేయబడిన నంబర్‌లకు కాల్ చేయడం కచ్చితంగా నిషేధించాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com