ఒమన్‌లో GCC అక్రిడిటేషన్ సెంటర్ బ్రాంచ్
- June 10, 2024
మస్కట్: వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సంవత్సరం "అక్రిడిటేషన్: ఎంపవరింగ్ టుమారో అండ్ షేపింగ్ ది ఫ్యూచర్ " అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. ఒమన్ వేడుకలో ఒమన్ సుల్తానేట్‌లో గల్ఫ్ అక్రిడిటేషన్ సెంటర్ (GAC) కోసం ఒక శాఖను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. నేషనల్ అక్రిడిటేషన్ సెంటర్ కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో కేంద్రం సహాయం చేస్తుందని, అక్రిడిటేషన్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అక్రిడిటేషన్ సంస్థల నుండి ఒమన్ గుర్తింపు పొందేందుకు కేంద్రం మార్గం సుగమం చేస్తుందన్నారు. "ఒమన్ అక్రిడిటేషన్ సెంటర్" అని పిలవబడే జాతీయ అక్రిడిటేషన్ కేంద్రాన్ని స్థాపించడానికి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని, ఇది ఒమన్ సుల్తానేట్ మార్కెట్లలో నాణ్యమైన ఉత్పత్తుల ఉనికిని నిర్ధారించడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ అసెస్‌మెంట్ బాడీలకు సహాయపడుతుందన్నారు. ఈ కేంద్రం అక్రిడిటేషన్‌కు సంబంధించిన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ఫోరమ్‌లలో ఒమన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఇది ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అక్రిడిటేషన్ బాడీలతో పరస్పర గుర్తింపు ఒప్పందాలపై సంతకం చేస్తుందని, తద్వారా పరస్పర గుర్తింపు ధృవీకరణ పత్రాలను అందుకుంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







