యూఏఈ లో కొత్త ఫెడరల్ ట్రాఫిక్ చట్టం

- June 11, 2024 , by Maagulf
యూఏఈ లో కొత్త ఫెడరల్ ట్రాఫిక్ చట్టం

యూఏఈ: ట్రాఫిక్పై కొత్త ఫెడరల్ చట్టాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వరయంలోని క్యాబినెట్ ఆమోదించింది. కొత్త చట్టం ప్రకారం.. వాహనాల వర్గీకరణ మరియు రోడ్లపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగానికి సవరణలు చేయనున్నారు.  సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు మరియు ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని విస్తరించడానికి కొత్త చట్టం వర్తిస్తుంది అని దుబాయ్ పాలకుడు చెప్పారు.  

యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ జారీ చేసిన పర్యాటకుల రక్షణ కోసం అంతర్జాతీయ కోడ్ సూత్రాలు, సిఫార్సులకు యూఏఈ మంత్రివర్గం ఆమోదించింది. ఈ కోడ్ పర్యాటక సంస్థలకు మార్గదర్శకంగా ఉపయోగించబడుతుంది మరియు దాని సూత్రాలను వర్తింపజేస్తామని షేక్ మహమ్మద్ తెలిపారు.

యూఏఈ ఇటీవలే గ్లోబల్ ఎకనామిక్ బ్లాక్ BRICSలో చేరింది. ప్రపంచంలోని విభిన్న సమూహాలతో ఆర్థిక ఛానెల్స్ నిర్మించడానికి మరియు ప్రపంచ ఆర్థిక సంబంధాలను కొనసాగించడానికి దేశం ఆసక్తిగా ఉందన్నారు.  దేశంలోని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్సిసిఐ)ని అభివృద్ధి చేయడానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com