చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి
- June 11, 2024
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షాతోపాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికూడా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరంకు చిరంజీవి వెళ్లనున్నారు. విజయవాడంలో రాత్రి బసచేసి ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోనున్నారు. పవన్ కల్యాణ్ కూడా రేపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం నేపథ్యంలో చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 11గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







