రాజధాని విషయంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
- June 11, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు వైజాగ్ అభివృద్ధిపై మనసులో మాటను బాబు బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని మరోసారి స్పష్టం చేసిన బాబు.. ఆర్థిక రాజధానికి విశాఖపట్నంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోమని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన విశాఖ రాజధాని ప్రతిపాదనలు.. కర్నూలు న్యాయ రాజధాని అనే మోసాలను ప్రజలు గమనించారన్నారు. కర్నూలు అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







