క్లాస్ చిలిమా మరణం పై సుల్తాన్ సంతాపం
- June 12, 2024
మస్కట్: మలావి రిపబ్లిక్ వైస్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ సౌలోస్ క్లాస్ చిలిమా మరణంపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాపం తెలియజేసారు. ఈ మేరకు మలావి రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ లాజరస్ చక్వేరాకు సంతాప సందేశాన్ని పంపారు. మలావి ప్రజలకు మరియు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా మరియు మాజీ ప్రథమ మహిళ షానిల్ డిజింబిరితో సహా మరో తొమ్మిది మంది వారు ప్రయాణిస్తున్న సైనిక విమానం కూలిపోవడంతో మరణించినట్లు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం తెలిపారు. విమానం సోమవారం ఉదయం 09:17 గంటలకు (0717 GMT) రాజధాని లిలాంగ్వే నుండి బయలుదేరింది. అయితే 10:02 గంటలకు షెడ్యూల్ ప్రకారం Mzuzu విమానాశ్రయంలో అది ల్యాండ్ కాలేదు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ మరణించారని, మిలటరీ వారి అవశేషాలను తిరిగి రాజధానికి తీసుకువస్తోందని చక్వేరా చెప్పారు.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు







