తనయుని విజయానికి పరశించిన ఎం.ఎస్.రాజు
- June 11, 2016
``సుమంత్ అశ్విన్ నటించిన `రైట్ రైట్` గురించి చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సుమంత్ తన కెరీర్లో ఇంత త్వరగా ఇలాంటి సినిమాను చేసి మెప్పించడం తండ్రిగా నాకు చాలా సంతోషదాయకం`` అని స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పించిన `రైట్ రైట్` శుక్రవారం విడుదలైంది. శ్రీ సత్య ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. పూజా జవేరి నాయికగా నటించిన ఈ చిత్రంలో `బాహుబలి` ఫేమ్ ప్రభాకర్ కీలక పాత్రలో పోషించారు. ఈ సినిమా గురించి శనివారం ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ``రైట్ రైట్ చూశాను. సున్నితమైన ప్రేమకథను మను చాలా బాగా తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఫ్రెష్‌గా, ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా, చూస్తున్నంత సేపూ ఆహ్లాదకరంగా అనిపించింది. తొలి సగం చూసినప్పుడు బావుందనిపించింది. మలిసగం చూశాక ఇంకా బావుందనిపించింది. కథలో ట్విస్ట్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కన్విన్సింగ్‌గా ఉన్నాయి. కండక్టర్ పాత్రలో సుమంత్ అశ్విన్ చాలా బాగా చేశాడు. ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే బస్సులో జరిగే కథ ఇది. అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను దర్శకుడు మను చక్కగా తెరకెక్కించారు. కీలక సన్నివేశాల్లో జె.బి. ఇచ్చిన నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. లొకేషన్లు కూడా కొత్తగా కనిపిస్తాయి. చూసిన వారికి కన్నులపండువగా ఉంటుంది. నాజర్ పాత్ర హైలైట్ అవుతుంది. షకలక శంకర్, ధన్‌రాజ్, జీవా, భరత్‌రెడ్డి పాత్రలు మెప్పిస్తాయి. బాహుబలి ప్రభాకర్ కొత్తగా కనిపించాడు`` అని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







