నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

- June 13, 2024 , by Maagulf
నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

బెంగళూరు: బెంగళూరులోని ఓ ఫాం హౌస్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయగా, టాలీవుడ్ నటి హేమ కూడా పట్టుబడడం తెలిసిందే. హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో, ఆమె జైలు నుంచి బయటికి రానున్నారు. బుధవారం బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమ తరఫున అడ్వొకేట్ మహేశ్ కిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. తన క్లయింటు వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని కోర్టుకు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com