ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్..
- June 13, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బీజేపీ తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ బొగ్గు, గనుల శాఖ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీజేపీ తెలంగాణ నేతలు పాల్గొన్నారు.
కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించారు కిషన్ రెడ్డి.
మోదీ, దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. దేశంలో బొగ్గు కొరత లేకుండా చూస్తామని తెలిపారు. దేశంలో మోదీ ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా చూస్తోందని అన్నారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి బొగ్గుద్వారానే ఎక్కువ జరుగుతుందని తెలిపారు.
హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ బాధ్యతలు
మరోవైపు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బండి సంజయ్‌కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్‌లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







