విద్యార్థి నిజాయితీ..సత్కరించిన దుబాయ్ పోలీసులు
- June 15, 2024
దుబాయ్: నిజాయితీని చాటుకున్న ఓ నాలుగో తరగతి విద్యార్థిని దుబాయ్ పోలీసులు సత్కరించారు. తనకు దొరికిన నగదు ఉన్న పర్సును తిరిగి ఇచ్చిన అతని నిజాయితీని మెచ్చుకున్నారు.
అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒమర్ బిన్ అల్ ఖత్తాబ్ స్కూల్లో చదివే స్టూడెంట్ అహ్మద్, అల్ ముహైస్నా 4 ప్రాంతంలో దొరికిన డబ్బుతో కూడిన వాలెట్‌ను నిజాయితీగా తిరిగిచ్చాడు. అతని నిజాయితీకి మెచ్చిన పోలీసులు ప్రత్యేకంగా సత్కరించారు. కస్టమర్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ నుండి లెఫ్టినెంట్ డానా అల్ ముహైరీ, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ నాసర్ అబ్దుల్ అజీజ్ అల్ ఖాజా సమక్షంలో అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ జమాల్ ఇబ్రహీం అలీ, విద్యార్థి అహ్మద్ సలేహ్ అలీ ముహమ్మద్‌ను సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హుదా యూసుఫ్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు. కల్నల్ జమాల్ ఇబ్రహీం మాట్లాడుతూ.. అహ్మద్ నిజాయితీ, మంచి ప్రవర్తన మరియు పర్సు, డబ్బును దాని యజమానికి తిరిగి ఇవ్వడానికి పోలీసు స్టేషన్‌తో కమ్యూనికేట్ చేయాలనే ఆసక్తిని కొనియాడాడు. నిజాయితీ మరియు చిత్తశుద్ధి కోసం సమాజ సభ్యులు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దుబాయ్ పోలీసులు తన కుమారుడిని సన్మానించడంతో పాటు అతని పాఠశాలలో అలా చేయాలనే స్ఫూర్తి కలిగించినందుకు విద్యార్థి తల్లి సంతోషం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







