జెడ్డాలో భవనం కూలి ఏడుగురు మృతి..పలువురు అరెస్ట్
- June 15, 2024
జెడ్డా: జెడ్డాలో నివాస భవనం కూలిన ఘటనకు సంబంధించి అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మందికి గాయాలు అయినట్లు తెలిపారు. మే 30 న జెద్దాలోని అల్-ఫైసాలియా పరిసరాల్లో నివాస భవనం కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది గాయపడిన ఘటనపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. భవన నిర్మాణ అనుమతుల జారీలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మక్కా ప్రాంతానికి చెందిన ఎమిర్ ఏర్పాటు చేసిన కమిటీతో నజాహా అధికారులు విచారణ చేస్తున్నారు. భవనంలో సాంకేతిక లోపాలున్నట్లు విచారణలో తేలింది. మునిసిపాలిటీ భవన యజమాని ఫిరాస్ హనీ అల్ తుర్కీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని భాగస్వామ్య సేవల డిప్యూటీ మంత్రిని నిర్మాణాన్ని నిలిపివేయమని ఆదేశించింది. కానీ అతను నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని నజహా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







