చేతి గోళ్లు ఆరోగ్యానికి..
- June 11, 2016
చేతి గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ మెనిక్యూర్‌లు చేయించుకోవడం ఒక్కటే కాదు.. అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే.. *
గోళ్లు బలహీనంగా కనిపిస్తున్నాయా.. మీరు తీసుకునే ఆహారంలో బయోటిన్ ఉండేలా చూసుకోండి. బయోటిన్ గోళ్లు ఆరోగ్యంగా ఎదిగేందుకూ తోడ్పడుతుంది. బయోటిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులూ, పొద్దుతిరుగుడు గింజలూ, గుడ్లూ, క్యాలీఫ్లవర్, ¤బాదం, అరటి, సోయాబీన్స్.. లాంటివి తీసుకుంటే సరిపోతుంది.
* గోళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటికి రంగు వేసుకోవడం మంచిది. రంగు గోళ్లకు రక్షణగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడూ కాస్త విరామం ఇవ్వాలి. దానివల్ల గోళ్లకు గాలి తగిలి, తేమగా, తాజాగా మారతాయి. వీలైనంతవరకూ అసిటోన్ లేని నెయిల్‌పాలిష్ రిమూవర్‌ని ఎంచుకుంటే మంచిది.
* గోళ్ల సంరక్షణ అంటే చుట్టూ ఉండే పలుచటి పొరలాంటి చర్మాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. చాలామంది మెనిక్యూర్‌లో భాగంగా ఆ చర్మాన్ని వెనక్కి నొక్కడం.. లేదా ట్రిమ్ చేయడం చేస్తుంటారు. అది అన్నిసార్లూ అవసరంలేదు. ఒకవేళ చర్మం ఎర్రగా మారినా, వాచినా, నొప్పిగా అనిపిస్తున్నా.. తేలిగ్గా తీసుకోకూడదు. వైద్యుల్ని సంప్రదించడం తప్పనిసరి.
* ఫ్యాషన్ అంటే గోళ్లను పెద్దగా పెంచుకుని రంగు వేసుకోవడమనే అనుకుంటారు. కానీ కాదు. ఇప్పటి ట్రెండ్ ప్రకారం వాటిని చిన్నగా కత్తిరించుకుని, పరిశుభ్రంగా ఉంచుకోవడమే అందం. అలా చేయడం వల్ల అవి ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి. ఓ ఆకృతి అంటూ లేకుండా విరిగిపోకుండానూ ఉంటాయి. గోళ్ల అంచులు మృదువుగా కనిపించేందుకు నెయిల్ ఫైల్‌తో ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇంటిపనులు చేస్తున్నప్పుడు, నీళ్లతో ఎక్కువగా పని చేస్తున్నప్పుడూ, వీలైనంతవరకూ గ్లవుజులు వేసుకోవడం మంచిది. లేదంటే నీళ్లలో ఎక్కువసేపు నానడం వల్ల గోళ్లు బలహీనమవుతాయి.
* గోళ్లకు సంబంధించిన ఎంత చిన్న ఇన్‌ఫెక్షన్ అయినా సరే.తేలిగ్గా తీసుకోవద్దు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







