గవర్నర్ తో భేటి అయిన చంద్రబాబు
- June 11, 2016
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ర్టంలో పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. ఈ నెల 27 నుంచి ఏపీ నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడికి సచివాలయాన్ని,శాఖాధిపతులను తరలించి పరిపాలన కొనసాగించేందుకు చేపట్టిన చర్యలు , తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, అనంతర పరిణామాలు తదితరాల గురించి గవర్నర్కు వివరించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







