వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోట మూడు నెలల ముందే విడుదల
- June 18, 2024
తిరుమల: వయోవృద్ధుల దర్శనంకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి, ఇది పూర్తిగా నిజం కాదు.
వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది.
ప్రస్తుతం ఆన్లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డాయి. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
కావున సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ http://www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







