వాట్సాప్ గ్రూపు ద్వారా ఏఏ మొక్కలు, ఎక్కడెక్కడ నాటాలి...
- June 12, 2016
రంగారెడ్డి జిల్లా బాచుపల్లి పంచాయతీలోని హరితవనం కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేకానంద ఆదివారం ప్రారంభించారు. ట్రీయిజం సంస్థ ఆధ్వర్యంలో 'ఈనాడు-ఈటీవీ తెలంగాణ' సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు ఇంటికో మొక్క చొప్పున నాటాలని 15 రోజుల క్రితం నిర్ణయించారు. వాట్సాప్ గ్రూపు ద్వారా ఏఏ మొక్కలు, ఎక్కడెక్కడ నాటాలి... పర్యవేక్షణ ఎవరికి అప్పగించాలనే అంశాలపై అభిప్రాయ సేకరణ చేశారు. కాలనీ ప్రధాన రహదారిలో విద్యుత్స్తంబాల తీగల కింద పూలు, అలంకరణ మొక్కలు.. స్తంబాలు లేని చోట పొడవుగా పెరిగే మొక్కలు నాటాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆదివారం ఆయా మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఆయా మొక్కల సంరక్షణ కోసం జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. మొక్క ట్రీగార్డుకు పర్యవేక్షణదారు ఫొటోను అతికిస్తారు. ఉత్తమంగా మొక్కలు సంరక్షించిన వారికి బహుమతులు కూడా ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు సైతం భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో సర్పంచి ఆగం పాండు, కాలనీ అసోసియేషన్ నేతలు దీపక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







