షార్ట్ ఫిలిం తీసి చూడు.! నెటిజన్‌పై మాస్ కా దాస్ ఫైర్.!
- June 19, 2024
సినిమా తీయాలంటే దాని వెనక బోలెడంత కష్టం దాగి వుంటుంది. కొన్ని వందల మంది జీవితాలు కూడా ముడి పడి వుంటాయ్. కానీ, సినిమా చూసి రివ్యూ ఇస్తూ.. అబ్బే.! సినిమా ఏం బాలేదు.. అంటూ కొన్ని సినిమాల్ని బాగున్న సినిమాల్ని కూడా చంపేస్తుండడం బాధాకరం.
ఎంతో కష్టపడినా కూడా ఫోకస్ లేకుండా సినిమాలు తీసేస్తున్న సందర్భాలను చూస్తున్నాం. కొన్ని కంటెంట్ లేని సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు అవుతున్న సందర్భాలూ చూస్తున్నాం.
అసలు మ్యాటర్ ఏంటంటే, తాజాగా ‘కల్కి’ సినిమా ట్రైలర్‌పై ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ చూసిన మాస్ కా దాస్‌కి ఎక్కడో మండింది. అంతే పోస్ట్ కంట పడిందే తడవుగా ఆ నెటిజన్‌పై గుస్సా అయ్యాడు.
సినిమా తీయడమంటే అంత ఆషామాషీ అనుకున్నావా.? కొన్ని నిమిషాల పాటు సాగే ఒక్క షార్ట్ ఫిలిం తీసి చూడు అప్పుడే అర్ధమవుతుంది సినిమా తీయడమంటే ఎంత ప్రహసనమో.. అని సదరు నెటిజన్‌కి చురకలంటించేశాడు.
ఆ కష్టం తెలియకుండా ఎవ్వరూ సినిమాలపై తమ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదన్నది విశ్వక్ సేన్ అభిప్రాయం కావచ్చు.
అన్నట్లు రీసెంట్‌గా విశ్వక్ నుంచి వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం ధియేటర్లలో జస్ట్ ఓ మోస్తరు టాక్ దక్కించుకుంది. కానీ, ఓటీటీలో ఈ సినిమానీ దేకిన వారంతా మిశ్రమ స్పందనలే తెలియజేయడం ఆశ్చర్యకరం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







