‘కల్కి’ రన్ టైమ్ లాక్.! ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే.!
- June 19, 2024
మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్ని విజువల్ వండర్‌లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది ‘కల్కి 2898 ఏడీ’. ప్రబాస్, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని నాగ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
పక్కా.! రికార్డులు బద్దలు కొట్టడం.! అన్న నమ్మకంతో వున్నారు చిత్ర యూనిట్. తాజాగా సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఎక్కడా కత్తెరలు పడలేదు.
మంచి టాక్ కూడా బయటికి వస్తోంది. ప్రచార చిత్రాలదేముంది కానీ, విజువల్స్ చాలా బాగున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్న ఇన్‌సైడ్ సమాచారం.
ఇక, రన్ టైమ్ విషయానికి వస్తే.. దాదాపు మూడు గంటల పాటు కొత్త ప్రపంచం కాదు కాదు, భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోనుంది ‘కల్కి’ టీమ్.
2 గంటల 58 నిమిషాల రన్ టైమ్‌ని లాక్ చేశారు. ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైయంతీ మూవీస్ బ్యానర్‌లో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







