తమిళనాడు కల్తీ సారా ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

- June 20, 2024 , by Maagulf
తమిళనాడు కల్తీ సారా ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

చెన్నై: తమిళనాడు కల్తీ సారా తాగి ఆసుపత్రి పాలైన ఘటన లో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో మంగళవారం రాత్రి కల్తీ సారా తాగిన తర్వాత వాంతులు, విరోచనాలు , కడుపులో మంట ఇలా అనేక కారణాలతో ఇబ్బందులు పడడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ , ప్రవైట్ హాస్పటల్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఇప్పటివరకు 34 మంది మరణించగా..ఇంకా చాలామంది పరిస్థితి విషయంగా ఉంది. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి.

కాళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్‌ ఎంఎస్‌ ప్రశాంత్‌ పరామర్శించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కల్తీసార మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ‘కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను . నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని’ సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కల్తీసారా ఘటనలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కలెక్టర్ శ్రావణ్ కుమార్ ను బదిలీ చేసారు. జిల్లా ఎస్పీ మీనాను సస్పెండ్ చేశారు. కల్తీ సారాను తయారు చేసి దానిని తక్కువ ధరకు విక్రయించడంతోనే ఎక్కువ మంది తాగారని అందుకే ఈ స్థాయిలో అస్వస్థతకు గురయ్యారని, ఎక్కువ స్థాయిలో మరణించారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులయిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com