అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపి తరుణ్ జోషి
- June 21, 2024
హైదరాబాద్: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్ పేట సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, యోగా అనేది ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.యోగా సాధన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో తీవ్రమైన ఒత్తిడి మధ్య అహర్నిశలు పనిచేసే సిబ్బందికి యోగా సాధన ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది తమ వీలును బట్టి తప్పనిసరిగా యోగా సాధన చేయాలని సూచించారు.
రాచకొండ డిసిపిలు, అదనపు డిసిపిలు మరియు హెడ్ క్వార్టర్స్ లోని పలు స్థాయిల అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో యోగా సాధన చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







