బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్ లొంగదీసుకుంటుంది: హరీష్ రావు

- June 21, 2024 , by Maagulf
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్ లొంగదీసుకుంటుంది: హరీష్ రావు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లడం వారిని భయపెట్టి తమ దారికి తెచ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని అన్నారు.

కాంగ్రెస్ మ్యానిఫేస్టోలో చెప్పిందేమిటి? వీళ్లు చేస్తుందేమిటి? అన్ని హరీశ్ రావు ప్రశ్నించారు. మ్యానిఫేస్టోలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాత్రం దానిని తుంగలోకి తొక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుందని హరీశ్ రావు అన్నారు.

ఇక ఈరోజు మాజీ స్పీకర్, బిఆర్ఎస్ పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ , మంత్రి పొంగులేటి ..పోచారం తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి ఆహ్వానం పట్ల పోచారం సానుకూలంగా స్పందించడంతో శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీఆర్​ఎస్​లో సీనియర్​ నేతగా ఉన్న శ్రీనివాస్​ రెడ్డి, కుమారుడు భాస్కర్​ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరడంతో ‘కారు’కు పెద్ద షాక్​ తగిలినట్లైంది.

సీఎం రేవంత్​ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లారనే విషయం తెలియగానే పోచారం నివాసానికి బాల్క సుమన్​, బీఆర్​ఎస్​ నేతలు వెళ్లారు. పోచారం నివాసం వద్ద బీఆర్​ఎస్​ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు బీఆర్​ఎస్​ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com