తమిళనాడులో 49కి చేరిన క‌ల్తీసారా మృతుల సంఖ్య‌

- June 21, 2024 , by Maagulf
తమిళనాడులో 49కి చేరిన క‌ల్తీసారా మృతుల సంఖ్య‌

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరుణాపురంలో నాటు సారా ఘటనలో ఇవాళ్టి వరకు మృతి చెందిన వారి సంఖ్య 49కు చేరుకుందని తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సుమారు 112 మంది బాధితులు జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిలో మ‌రో 51 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.. ఇక కల్తీ సారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు ఫెయిల్ అవుతుండటంతో నిపుణులైన వైద్యులను తమినాడు సర్కార్ రంగంలోకి దించింది.

ఇక, విళుపురం, సేలం తిరుచ్చి, తిరువణ్ణామలై జిల్లాల్లోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే, మరోవైపు కళ్లకురిచ్చి ఘటనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరనసలు తెలిపారు. ఇక, నిరసన తెలిసన ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి .ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్‌ చేశారు. జూన్‌ 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి వెల్లడించారు. ఇక ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన 11 మందిని ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేశారు.. జిల్లా క‌లెక్ట‌ర్ బ‌దిలీ కాగా, ఎస్పీని స‌స్పెండ్ చేశారు… మ‌రో 22 మంది ఎక్సైజ్ సిబ్బందిపై బ‌దిలీ వేటు వేశారు.. ఈ ఘ‌ట‌నపై సిబిఐ విచార‌ణ‌కు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఆదేశించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com