అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం
- June 23, 2024
అమెరికా: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన యువకుడు మృతిచెందాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గో్పీకృష్ణ (32) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. పది నెలల క్రితంమే సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. జాబ్ ప్రయత్నంలో ఉండగానే.. సౌత్ ఆర్కెన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ సూపర్ మార్కెట్ లోని కౌంటర్ లో ఉండగా.. ఓ దుండగుడు వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో గోపీకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కాల్పులు అనంతరం దుండగుడు సూపర్ మార్కెట్ లోని వస్తువులను తీసుకొని పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడిఉన్న గోపీకృష్ణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతిచెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలాఉంటే.. దుకాణం లోపలేకాక పార్కింగ్ స్థలంలోను దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కాల్పులకు సంబంధించిన సీసీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







