ఇళ్ళలో పిల్లల రక్షణకు బేబీ గేట్‌లు..పేరెంట్స్ కు అథారిటీ పిలుపు

- June 23, 2024 , by Maagulf
ఇళ్ళలో పిల్లల రక్షణకు బేబీ గేట్‌లు..పేరెంట్స్ కు అథారిటీ పిలుపు

యూఏఈ: ఇంటి లోపల బేబీ గేట్‌లను అమర్చాలని తల్లిదండ్రులను అబుదాబి సివిల్ డిఫెన్స్  కోరింది. ఇంట్లో ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తల్లిదండ్రులు బేబీ గేట్‌లను అమర్చాలని ఓ ట్వీట్‌లో పేర్కొంది. పిల్లలు ఇంట్లో ఆడుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను చూపించే వీడియోను షేర్ చేశారు. మెట్ల మీద నుంచి జారిపోయే ప్రమాదం నుండి ఇంటి మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తూ కిందకు పడిపోవడం వరకు ఈ వీడియో.. ఇళ్లలో తరచుగా జరిగే అనేక ప్రమాదాలను హైలైట్ చేసింది. తమ ఇళ్లలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తమ ఇళ్లలో "ఎఫెక్టివ్, నాన్-క్లైంబ్" బారియర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com