ఏపీ గవర్నర్ కార్యదర్శిగా భాధ్యతలు స్వీకరించిన డా.హరి జవహర్‌లాల్

- June 24, 2024 , by Maagulf
ఏపీ గవర్నర్ కార్యదర్శిగా భాధ్యతలు స్వీకరించిన డా.హరి జవహర్‌లాల్
విజయవాడ: గవర్నర్‌ కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి డా. ఎం. హరి జవహర్‌లాల్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాననీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్ కార్యదర్శిగా డా. హరి జవహర్‌లాల్ నియమితులయ్యారు.  
 
రాజ్‌భవన్‌కు చేరుకున్న డా.హరి జవహర్‌లాల్‌కు గవర్నర్ సంయుక్త కార్యదర్శి పి.ఎస్. సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి పి.నారాయణ స్వామి, గవర్నర్ ఎడిసిలు మేజర్ దీపక్ శర్మ,  రామాంజనేయులు స్వాగతం పలికారు.అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు డాక్టర్ హరి జవహర్‌లాల్‌కు ఆశీర్వచనం అందజేశారు.రాజ్‌భవన్‌ అధికారులు మరియు సిబ్బంది డాక్టర్ హరి జవహర్‌లాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com