రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
- June 24, 2024
విజయవాడ: ఏపీ గనులు–భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సెక్రటేరియట్ మూడో బ్లాక్ లో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తన సతీమణి కొల్లు నీలిమసహా కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు పవన్ కల్యాణ్, లోకేష్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీరం చేశారని మండిపడ్డారు.
అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.ఈ రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గతంలో ఇసుకలో భారీగా అక్రమాలు జరిగాయని, జగన్ మద్యపాన నిషేదం అని చెప్పి మద్యాన్ని తాకట్టు పెట్టి రూ. 30 వేల కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు. నిషేధం అన్నప్పుడు అప్పులు ఎలా తెచ్చారో చెప్పాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు… ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకొని దోపిడీ చేయడంపై తన క్యాబినెట్లో చర్చిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







