సిద్దర్ద్ నూతన చిత్రం 'సైతాన్కీ బచ్చా'
- June 12, 2016
తమిళ చిత్రాలకు శీర్షికలు ఇదే భాషలో ఉండాలనే ఉద్దేశంతో అలాంటి సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని సంవత్సరాలుగా చిత్రాల పేర్లన్నీ దాదాపుగా మాతృభాషలోనే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరి హీరోల సినిమాలు మాత్రం ఇందుకు మినహాయింపు. సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్రం 'జిల్ జంగ్ జక్'గానే విడుదలైంది. తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రానికి 'సైతాన్కీ బచ్చా' అనే శీర్షికను ఖరారు చేశారు. 'కప్పల్' దర్శకుడు కార్తిక్ జి.క్రిష్ దీన్ని రూపొందించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్నారు.
ఇది సిద్ధార్థ్, సంతోష్ నారాయణన్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడం గమనార్హం. చిత్ర హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







