ఫ్లోరిడాలోని గే క్లబ్ లో కాల్పులు...50 మంది మృతి
- June 12, 2016
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ స్వలింగ సంపర్కుల నైట్‌క్లబ్‌లో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 50 మంది మృతి చెందినట్లు సమాచారం. ఓర్లాండో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సూచించారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. పోలీసుల ప్రతిదాడిలో కాల్పులకు పాల్పడ్డ ఆగంతకుడు మృతి చెందాడు.
కాల్పుల సమయంలో క్లబ్లో దాదాపు వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. క్లబ్‌ను మూసివేసే సమయంలో దుండగుడు అనేక మందిని బంధీలుగా చేసుకుని కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటన ఓర్లాండోలో జరిగిన కాల్పుల్లో 50 మంది మృతి చెందడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు నగర మేయర్ బడ్డీ డేయర్ తెలిపారు. భద్రతా దళాలు పరిస్థితిని గమనిస్తున్నాయి.
ఉగ్రవాద హస్తం ఉందా.. లోన్ ఉల్ఫ్ రకం దాడిగా దీనిని భావిస్తున్నారు. దాడికి పాల్పడిన దుండగుడి పేరు ఒమర్ మట్టీన్గా భావిస్తున్నారు. ఇతనికి ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







