కువైట్ లో ప్రవాసులచే ఘనమైన సత్కారమందుకున్న కుదరవల్లి
- June 12, 2016_1465754926.jpg)
_1465754939.jpg)
కువైట్, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువారి కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ప్రవాసాంధ్రుడు, కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు కు గల్ఫ్ - కువైట్ దేశాలకు చెందిన పలువురు తెలుగువారు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కువైట్ లోని హపల్లిలో ఉన్న అవంతి ప్యాలస్ లో నిర్వహించిన ఈ సత్కార సభలో కుదరవల్లి మాట్లాడుతూ.. నాకు ఇంతటి గౌరవాన్ని అందించిన అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా. మనకు దక్కినదాంట్లో ఇతరులకు సాయం చేయడం అన్నది స్వర్గీయ యన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలోని సేవాగుణం కూడా నాకు సేవామార్గం చూపించింది. ఆపన్నులను ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదు. నాకు అన్నివేళలా సహకరిస్తున్న యన్టీఆర్ ట్రస్ట్ వారికి, వెన్ను దన్నుగా నిలుస్తున్న మిత్రులందరికీ నా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున కుదరవల్లిని జ్ఞాపిక, శాలువాతో సత్కరించగా, అక్కలి నాగేంద్రబాబు, కొత్తపల్లి మోహన్ బాబు, కాపెర్ల పత్తభిరామ్ నాయుడు, దారురు సుభ్రమణ్యం, రవి, డిఫెన్సు, కువైట్ కాపు బలిజ సేవా దళం, ముదిలియార్, జీలకర్ర మురళి రాయల్స్ అండ్ టీం, బొమ్ము సి.ఎం., తెలంగాణా యువత, నారాయననాయుడు, ఈశ్వర్, మసిన, మద్దిన, యన్టీఆర్ 2 యన్టీఆర్ యువసేన కువైట్, కొండపల్లి నాగేశ్వరరావు, మారయ్య, బాబునాయుడు, కోటిబాబు, మోహన్ అండ్ టీం, కొత్తపల్లి రామ్, యన్టీఆర్ సేవాదళం కువైట్, కస్తూరి కోటేశ్వరనాయుడు, ఖైతాన్ బాబు, సురేష్, మన కడప సేవా సమితి సభ్యులు, నాగినేని రమేష్ బాబు, సుబ్బు ఆర్ వి ఎస్, పాతూరి ఫనిక్రిష్ణ లతో పాటు పెద్ద సంఖ్యలు తెలుగుదేశం అభిమానులు, తెలుగువారు హాజరై కుదరవల్లి సుధాకరరావుకు అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి నాగేంద్ర బాబు అక్కిలి, మోహన్ బాబు కొతపల్లి మరియు పట్టాభి నాయుడు కపెర్ల అధ్యక్షత వహించారు.
_1465754953.jpg)
_1465754964.jpg)
_1465754976.jpg)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







