ఫుజైరా హోమ్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు మృతి

- June 26, 2024 , by Maagulf
ఫుజైరా హోమ్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు మృతి

యూఏఈ: ఫుజైరాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో 8 ఏళ్ల బాలిక మరియు 7 ఏళ్ల బాలుడు ఉన్నారు.   తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల చిన్నారిని అధికారులు రక్షించారు. సివిల్ డిఫెన్స్ ఆపరేటింగ్ రూమ్‌కు మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు అల్ తువియాయిన్‌లోని ఓ ఇంటిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. సివిల్‌ డిఫెన్స్‌ బృందాలు వెంటనే ఇంటికి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.  అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు.  దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా, దేశంలో వేసవి కాలం ప్రారంభమవుతున్నందున అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఫుజైరా సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ ఒబైద్ అల్ తునైజీ ప్రజలను కోరారు. ఎయిర్ కండిషనింగ్ మరియు శీతలీకరణ పరికరాల వల్ల విద్యుత్ లోడ్లు పెరిగే ప్రమాదం ఉన్నందున, ఎలక్ట్రికల్ లైన్ల నిర్వహణ, వాటి భద్రతను నిర్ధారించాలని ఆయన నివాసితులను కోరారు. ఫుజైరా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ బిన్ ఘానెమ్ అల్ కాబి ఇద్దరు పిల్లల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com