‘ఇండియన్ 2’ ట్రైలర్ టాక్.! కమల్ విశ్వరూపమే.!

- June 26, 2024 , by Maagulf
‘ఇండియన్ 2’ ట్రైలర్ టాక్.! కమల్ విశ్వరూపమే.!

ఇది కదా కమల్ హాసన్ అంటే, ఇది కదా శంకర్ మేకింగ్ అంటే.! శంకర్‌తో అంత వీజీ కాదు. ట్రైలర్ కట్ అంటే ఇలా వుండాలి. గూస్ బంప్స్.. గూస్ బంప్స్. ఇదంతా ‘ఇండియన్ 2’ ట్రైలర్ గురించే.

రీసెంట్‌గా అనుకున్న టైమ్‌కే ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగా.. కాదు కాదు అంతకు మించి అన్నట్లుగా ట్రైలర్ వుంది.

టాక్ అదిరిపోతోందంతే. సినిమా షూటింగ్ స్టార్టింగ్ నుంచీ ఎన్నో కష్టాలు ఓర్చింది చిత్ర యూనిట్. అసలు వచ్చేదే కాదీ సినిమా.. అంటూ పెదవి విరిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.

కానీ, శంకర్ అండ్ కమల్ హాసన్ ఓ యజ్ఞంలా తీసుకుని ఈ సినిమాని పూర్తి చేశారు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా వచ్చిన ట్రైలర్‌లో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్స్, డైలాగ్స్ ఈజ్ అండ్ ఎవ్రీ సీన్ అద్భుతంగా వుంది. శంకర్ మార్క్ అంటే ఇలా వుంటుంది.. అంటూ సినిమాపై ఇంతవరకూ ఏమాత్రం లేని అంచనాలు అమాంతం పెరిగిపోయాయలా. ఇక వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి అద్భుతమైన సంలచనాలకు వేదికవుతుందో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com