‘డబుల్ ఇస్మార్ట్’ భలే ఛాన్స్ కొట్టేశాడుగా.!
- June 26, 2024
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’పై అటు రామ్ పోతినేనికీ, ఇటు పూరీ జగన్నాధ్‌కీ చాలానే ఆశలున్నాయ్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టి పూరీ జగన్నాధ్ తన మార్క్ నిలబెట్టుకోవాలి.
ఇమేజ్ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. తాజాగా తన ఇమేజ్ తిరిగి తెచ్చుకోవాలి. ఇదంతా జరగాలంటే, మళ్లీ ఓ సూపర్ హిట్ కొట్టాల్సిందే.
అది ‘డబుల్ ఇస్మార్ట్’ రూపంలో ఆయన ముందుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ ఓ మోస్తరు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తనదైన మార్కు చూపించాడు ఈ టీజర్‌లో పూరీ జగన్నాధ్.
అయితే, ఇది చాలదు ఇంకా కావాలి. ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ‘పుష్ప 2’ రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌ని ‘డబుల్ ఇస్మార్ట్’ లాక్ చేసుకుంది. నిజంగా ఇది లక్కీ ఛాన్సే అని చెప్పొచ్చు ‘డబుల్ ఇస్మార్ట్’కి.
ఇంతవరకూ ఏ డేట్‌లో లాక్ అవ్వాలో తెలియని అయోమయంలో వున్న పూరీ అండ్ కోకి లక్కీగా ఈ డేట్ దక్కింది. దాంతో, దూసుకెళ్లాలనుకుంటున్నాడు. సినిమాని మరింత శరవేగంగా పూర్తి చేసి, ప్రమోషన్లు మొదలెట్టాలనుకుంటున్నారట. పూరీ ప్రమోషన్లు స్టార్ట్ చేస్తే ఓ రేంజ్‌లో వుంటుంది. చూడాలి మరి. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ బజ్ తీసుకొచ్చినా గట్టేక్కేసినట్లే మరి.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







