వరుణ్ సందేశ్.! ఎన్నాళ్లకెన్నాళ్లకు.!
- June 26, 2024
డ్రీమ్ బాయ్ ఇమేజ్‌తో పలు సూపర్ హిట్లు కొట్టిన హీరో వరుణ్ సందేశ్. ‘హ్యాపీ డేస్’ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ తదితర చాలా సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే, ఆ తర్వాత కెరీర్‌లో వెనకబడిపోయాడు. చాలా కాలంగా వరుణ్ సందేశ్‌ని దాదాపు మర్చిపోయారంతా. కానీ, తాజాగా ‘నింద’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
డ్రీమ్ బాయ్ కాస్తా సీరియస్ లుక్స్‌లోకి మారిపోయాడు ఈ సినిమా కోసం. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ధియేటర్లలో రిలీజైంది. తొలి రోజు టాక్ అంతంత మాత్రంగా వున్నప్పటికీ కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది ‘నింద’ సినిమా.
దాంతో, కలెక్షన్లు బాగానే రాబడుతోంది. ప్రస్తుతం వరుణ్ సందేశ్‌కి వున్న ఇమేజ్‌కి ఈ సినిమా ఈ రకంగా కలెక్షన్లు రాబట్టడం ఆశ్చర్యకరమే అంటున్నారు సినీ మేధావులు.
ఏధి ఏమైతేనేం, మొత్తానికి ఓ పాజిటివ్ టాక్ అయితే తేచ్చుకుంది కాబట్టి.. ఇక నుంచి ఈ తరహా డిఫరెంట్ కథనాలపై వరుణ్ సందేశ్ ఫోకస్ పెట్టొచ్చన్నమాటే.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







