రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు
- June 27, 2024
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం విజయవాడలోని కానూరులో జరిగింది.ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరయ్యారు.రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు.
సినీ ప్రముఖులు మురళీమోహన్, జయసుధ, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అశ్వినీదత్, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తిలకించారు. వేదిక వద్ద రామోజీరావుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, లోకేశ్ పుష్పాంజలి ఘటించారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. 8 జూన్ 2024 న తుదిశ్వాస విడిచారు. జూన్ 10 న రామోజీఫిల్మ్ సిటీ లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







