కువైట్ లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు..
- June 28, 2024
కువైట్: కువైట్ లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళల్లో వేడిగా ఉంటుందని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి మాట్లాడుతూ.. భారతదేశ రుతుపవనాల అల్పపీడనంతో కువైట్ ప్రభావితమవుతుందన్నారు. వేగవంతమైన వాయువ్య గాలులతో పాటు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, తేలికపాటి నుండి మోస్తరు వాయువ్య గాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా, పశ్చిమ ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దుమ్ము ధూళి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 మరియు 49 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని, సముద్రంలో 2 - 5 అడుగుల మధ్య తేలికపాటి నుండి మితమైన అలలలు వస్తాయన్నారు. శనివారం అల్-ఖరావిలో ఉష్ణోగ్రతలు 47 - 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







