మహా నగరాలకు దీటుగా..అత్యాధునికంగా నీజెన్ డయాగ్నోస్టిక్స్
- June 29, 2024
విజయవాడ: మహా నగరాలకు దీటుగా, అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు నీజెన్ డయాగ్నోస్టిక్స్ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా, ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజెన్ సేవలందించనుంది. ఏపీలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్ నీజెన్ ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నీజెన్ లోని డయాగ్నోస్టిక్స్ స్పెషలిటీ ల్యాబ్స్, జినోమిక్స్.. రాష్ట్ర వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించనున్నాయి. ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రకాశం రోడ్డులో నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం జరుగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ తెలియజేశారు. స్థానిక గ్రాండ్ విజయవాడ హోటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో, నీజెన్ డయాగ్నోస్టిక్స్ విశిష్టతలను ఆయన వివరించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, మహా నగరాల్లోని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు దీటుగా అత్యాధునిక సాధనా సంపత్తి, నిష్ణాతులైన శాష్ట్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్ బృందాలతో నీజెన్ ను తీర్చిదిద్దామని చెప్పారు. నమూనాలు తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే అన్ని రకాల టెస్టు రిపోర్టులను అందజేస్తామని, దీని ద్వారా అత్యవసర స్థితిలో ఉన్న పేషెంట్లకు త్వరితగతిన చికిత్సలు అందించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. అన్ని రకాల పరీక్షా ఫలితాలను నిర్దిష్ట కాల వ్యవధిలోగా పూర్తి కచ్చితత్వంతో అందిస్తామని చెప్పారు. నీజెన్ లోని జినోమిక్స్ విభాగం ద్వారా, జన్యు సంబంధిత విశ్లేషణలు జరిపి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఇప్పుడే తెలుసుకోవచ్చని వెల్లడించారు. జినోమిక్స్ పరీక్షల ద్వారా పేషెంటుకు అనుకూలమైన ఔషధాలను మాత్రమే సూచించే అవకాశం వైద్యులకు లభిస్తుందని, తద్వారా ఔషధాల దుష్ప్రభావాలకు లోనవ్వకుండా పేషెంట్లకు రక్షణ లభిస్తుందని వివరించారు. అన్ని పరీక్షలకు కచ్చితమైన ఫలితాలు, సమగ్ర రోగ నిర్ధారణ సేవలకు చిరునామాగా నీజెన్ నిలుస్తుందని డాక్టర్ రామ్ ప్రకాష్ విశ్వాసం వ్యక్తం చేశారు. నీజెన్ డయాగ్నోస్టిక్స్ నందు.. జెనెటిక్స్, జినోమిక్స్, ఫార్మాకోజినోమిక్స్, మైక్రో బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, రేడియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, హెమటాలజీ ఫ్లోసైటోమెట్రీ, ఇమ్యూనాలజీ, యాంటీ నేటల్, ప్రీ నేటల్, న్యూబోర్న్ స్క్రీన్ తదితర రెండు వేల రకాలకు పైగా పరీక్షలు అందిబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు నీజెన్ ప్రారంభోత్సవం జరుగుతుందని.. పవర్ మెక్ ప్రాజెక్ట్ సీఎండీ సజ్జా కిషోర్ బాబు, రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల నీజెన్ డయాగ్నోస్టిక్స్ ను లాంఛనంగా ప్రారంభిస్తారని డాక్టర్ రామ్ ప్రకాష్ ప్రకటించారు. ఈ సమావేశంలో వ్యాధి నిర్ధారణ సాధనా సంపత్తిని అందించే పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొని, అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన నీజెన్ నిర్వహకులకు అభినందనలు తెలియజేశారు.

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







