రజనీకాంత్ నిర్ణయం కారణంగా 5 కోట్ల రూపాయలు అదా..
- June 13, 2016
ప్రస్తుతం రజనీకాంత్ నటించిన మూవీ కబాలి. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. కబాలి మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. 'కబాలి' టీజర్ విడుదల నాటి నుండి, ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోవటంతో...ఈ మూవీ కచ్ఛితంగా హిట్ ని సాధించాలని రజనీకాంత్ సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ప్రతి మూవీ రిలీజ్ కి రజనీకాంత్ కొన్ని నమ్మాకాలను పాటిస్తాడు. అలా తనకి ఉన్నఆ సెంటిమెంట్స్ ని ఫాలో అయిన తరువాతనే మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తారంట. అయితే ఈ సారి రజనీకాంత్, కాబాలి మూవీ విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ని అన్నీ భాషల్లో రిలీజ్ చేసేందుకు రజనీకాంత్ డేట్స్ ని చిత్ర యూనిట్ తీసుకుంది. కానీ రజనీకాంత్ మాత్రం చివరినిముషంలో తన మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ని భారీగా చేయకూడదని, ప్రస్తుతం సినిమాకి క్రేజ్ ఉండటంతో ఆడియో ఫంక్షన్ ని నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని సూచించాడట. అందుకే యూఎస్ నుండి రావాల్సిన రజనీ, ఇండియాకి రాకుండానే ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసేలా చేశారు. రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆడియో ఫంక్షన్స్ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తంలో దాదాపు 5 కోట్ల రూపాయలు మిగిలినట్టే అని అంటున్నారు. ఈ మొత్తాన్ని మూవీ డిజిటల్ ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మళయాలంతో పాటు హిందీలోనూ డబ్ అయిన కారణంగా ఒకేసారి దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనూ మంచి నమ్మకం ఉందని అంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







