'లైలా'గా వస్తున్న విష్వక్సేన్..
- July 03, 2024
హైదరాబాద్: వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. విశ్వక్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. త్వరలో మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు విశ్వక్. తాజాగా మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు. ఆల్రెడీ గతంలో లైలా అనే సినిమా చేస్తున్నట్టు విశ్వక్ ప్రకటించాడు.
షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటివ రకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం.
తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. ఇక ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఇందులో విశ్వక్ అమ్మాయిలా రెడీ అయ్యాడు. అయితే క్లోజ్ గా ఫేస్ లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్ గా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







