మరాఠీ 'సైరాట్' తెలుగులో..
- June 13, 2016
'సైరాట్'.. ప్రస్తుతం మరాఠీలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న చిత్రం. ఇప్పటిదాకా రూ.40 కోట్లు అత్యధిక వసూళ్లుగా ఉన్న మరాఠీ చిత్ర పరిశ్రమను వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. భారతీయ సినీ అభిమానులందరినీ ఆకట్టుకుంటోన్న ఈ 'సినిమా'.. దక్షిణాది భాషల్లోనూ రీమేక్ కానుంది.
తమిళం.. కన్నడ.. తెలుగు.. మలయాళం భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు. అందుకు సంబంధించిన హక్కులను ప్రముఖ నిర్మాత రాక్ వెంకటేశ్ కొనుగోలు చేశారు. జీ స్టూడియోస్.. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంయుక్తంగా ఈ చిత్రాలను నిర్మించనున్నాయి.మహారాష్ట్రలోని ధనవంతురాలైన యువతి.. పేద కుంటుంబానికి చెందిన అబ్బాయి.. ఇద్దరి ప్రేమ కథే 'సైరాట్'. సాధారణ ప్రేమ కథే అయినా.. థియేటర్లలో ప్రేక్షకులను బాగా మెప్పించింది. అంతేకాకుండా తొలిసారి నటించిన కథానాయికకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది.కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టించింది
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







