‘ఇండియన్ 2’ రన్ టైమ్ లాక్ అయ్యింది.!
- July 05, 2024
శంకర్ దర్శకత్వంలో వస్తున్న కమల్ హాసన్ నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘ఇండియన్ 2’. దాదాపు 30 ఏళ్ల తర్వాత సేనాపతిగా ఈ సినిమాతో మళ్లీ రాబోతున్నారు కమల్ హాసన్. 30 ఏళ్ల కిందట వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం.
మళ్లీ అలాంటి సంచలనాలకు ఏమాత్రం మించకుండా వస్తున్నదే ‘భారతీయుడు 2’. ఈ సారి ఈ సినిమాలో సిద్ధార్ధ, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ వంటి నటీ నటులు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.
రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తో ఆల్రెడీ శంకర్ అండ్ కో మార్కులు కొట్టేశారు. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే రిలీజైన ప్రబాస్ ‘కల్కి’, ఇంతవరకూ సాధించిన రికార్డుల్ని ఈ సినిమా కొల్లగొట్టేయనుందని అంచనా వేస్తున్నారు.
సోషల్ మెసేజ్‌తో కూడి, ఉన్నతమైన నిర్మాణ విలువలతో రూపొందిన చిత్రమిది. ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు ఈ మధ్య కమల్ హాసన్. అదే హైప్‌ని ఈ సినిమాతో అంతకు మించి అనేలా కంటిన్యూ చేయబోతున్నారనడానికి ఉదాహరణగా వుంది ట్రైలర్లో ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్. ట్రైలరే ఆ రేంజ్లో వుంటే ఇక సినిమా ఏ రేంజ్లో వుండబోతోందో.!
అన్నట్లు తాజాగా ఈ సినిమాకి రన్ టైమ్ లాక్ చేశారు. 3 గంటల 4 నిముషాల లాంగ్ రన్టైమ్తో సినిమాని ముగించారు. ఇంత లాంగ్ రన్ టైమ్ వుందంటే సినిమాలోని పట్టు, పదును ఏ స్థాయిలో వున్నాయో కదా.!
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







